TDP Activist Murder Case: రాజకీయ కారణాలతో జరిగిన రామకృష్ణ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈనెల 15వ తేదీన దారుణ హత్య గురయ్యాడు..
Read Also: PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ
ప్రధాన నిందితుడు వెంకటరమణ అతని సహచరులు రామకృష్ణ కుమారుడు సురేష్ పై వేట కొడవిలితో దాడి చేయగా.. కొడుకును రక్షించేందుకు రామకృష్ణ ప్రయత్నించగా.. ప్రత్యర్ధులు రామకృష్ణను మెడపై నరికారు.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రామకృష్ణ హత్య రాజకీయ పోరులో ఒక భాగమని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రెడ్డప్ప రెడ్డి.. రామకృష్ణ హత్య కేసులో దాడికి మూలకర్తగా వ్యవహరించారని.. అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. రామకృష్ణ హత్య కేసులో ఉన్న నిందితులు పలు భూ అక్రమణాలకు పాల్పడినట్టు.. పలువురిని బెదిరించిన ఘటనల్లో పాల్గొన్నట్లు ఆధారాలను సేకవించారు పోలీసులు. హత్య కేసులో ముద్దాయిలు అక్కిసాని భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి , సంగారెడ్డి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తేల్చారు. హత్య కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలను ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని.. ఈ కేసులో సాక్షుల రక్షణకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు..