Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- 18 అంతస్తు నుంచి బిడ్డతో సహా దూకిన తల్లి..
- భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలని లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: మహారాష్ట్ర పూణేలో విషాదం చోటుచేసుకుంది. పింప్రి-చించ్వాడ్లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి 33 ఏళ్ల మహిళ తన 6 ఏళ్ల కుమారుడితో దూకి ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మహిళ ఇంట్లో పోలీసులు 8 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్నారు. మృతురాలని ఏక్తా బంగాడ్గా గుర్తించారు. ఆమె భర్త మనోజ్ బంగాడ్ పుణెలోని ఓ ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు మాధవ్ ఉన్నాడు. ఈ కుటుంబం పింప్రి-చించ్వాడ్లోని సిగ్నేచర్ పార్క్‌లో నివాసం ఉంటోంది. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఏక్తా భవనంలోని 18వ అంతస్తుకు తన కుమారుడిని తీసుకెళ్లి, అక్కడి కారిడార్ నుంచి డక్ట్‌లోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత తల్లీబిడ్డ మరణించినట్లు గుర్తించారు.
భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలని లేఖ..
ఈ కేసులో ఏక్తా రాసినట్లు భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తన భర్త పట్ల ఉన్న భావాలను వ్యక్తం చేయడంతో పాటు, తన మరణం తర్వాత భర్త మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే, తన కుమారుడు తన గురించి పదేపదే అడిగితే భర్తకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనే భయాన్ని ఆమె లేఖలో వ్యక్తపరించింది. అందుకు తనతో పాటే తన కుమారుడిని కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొంది. పిల్లవాడు ఉంటే మళ్లీ పెళ్లికి కష్టమవుతుందని రాసినట్లు సమాచారం.
Also Read
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
- Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
కొన్నేళ్లుగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న ఏక్తా..
ప్రాథమిక నివేదికల ప్రకారం.. కొన్నేళ్లుగా ఏక్తా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆమె దీని కోసం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటోంది. అయితే, ఎన్నో ఆస్పత్రులకు వెళ్లినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కూడా ఏక్తా సూసైడ్ నోట్లో ప్రస్తావించింది. ఈ ఘటనపై వాకడ్ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌గా నమోదు చేశారు.
- Tags
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!