Palnadu M*urder Case: పల్నాడు జిల్లా మరోసారి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరోసారి ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కలకలం సృష్టించింది. దుర్గి మండలం అడిగొప్పులకు చెందిన అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిలు అర్థరాత్రి హత్యకు గురయ్యారు. గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతును, నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తిలను హత్య చేశారు.
Read Also: Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీని మించిపోయిన తనూజ రెమ్యునరేషన్!
అయితే, పక్కా పథకం ప్రకారం వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు దుండగులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అన్నదమ్ముల హత్యకు కుటుంబ కలహాలతో పాటు వ్యక్తిగత విబేధాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వారు, హత్య చేసిన వారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. హత్య చేసింది ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇక, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.