తన బిడ్డ పవన్ కోసం అల్లాడుతున్న తల్లీ నీలం సునీత.. తన కొడుకు ఎక్కడ ఉన్నా.. త్వరగా ఇంటికి రావాలని ఓ వీడియోను విడుదల చేసింది. అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను.. నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు.. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, కోటేశ్వరరావులు వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి గ్రామానికి వస్తుండగా బోదిలవీడు సమీపంలో కారుతో గుద్దించి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యది అని తేలింది. కొంతకాలంగా వెంకట్రామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది.