మహిళలపై అఘాయిత్యాలకు కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపులేకుండా పోతోంది.. ప్రతీరోజూ ఏదో ఒక చోట దారుణమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. బయటకు వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్నా రక్షణలేని పరిస్థితి ఏర్పడింది.. తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళ ఇంట్లోకి దూరిన యువకులు.. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది..
ఆ పాశవిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాలౌన్ జిల్లా ఉరయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో.. తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది ఓ మహిళ.. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన నలుగురు యువకులు.. గోడ దూకి, ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధులను నిలువరిస్తూ.. అరిచేందుకు మహిళ ప్రయత్నించగా.. ఆమెపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు ఆ దుర్మార్గులు.. భయంతో వణికిపోతున్న ఆ మహిళపై అనంతరం అఘాయిత్యానికి పాల్పడి.. అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబసభ్యుల సహాయంతో మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.