Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. స్నేహితుడు హత్య
- ట్రయాంగిల్ లవ్‌కు ఒకరు బలి
- ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు
- ప్రత్యర్థి ప్రేమికుడ్ని చంపబోయి స్నేహితుడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రయాంగిల్ లవ్ కారణంగా ఒక స్నేహితుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. డీఎంకే నేత మనవడు సహా మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ కాగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఇద్దరు విద్యార్థులు.. ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అందులో ఒక ప్రేమికుడు చంద్రు…డీఎంకే కౌన్సిలర్ మనవడు సహాయం కోరాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని బెదిరించాలని కోరాడు. దీంతో సోమవారం చెన్నైలో రేంజ్ రోవర్ కారులో బయల్దేరారు. ప్రత్యర్థి వర్గం రెండు బైక్‌లపై వెళ్తున్నారు. అయితే ప్రత్యర్థి ప్రేమికుడు వెంకటేశన్‌ను చంపబోయి.. అతడి స్నేహితుడు నితిన్ సాయిను చంపేశారు. వెనుక నుంచి బైక్‌ను కారు ఢీకొట్టగా విద్యార్థి నితిన్ సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
అయితే మొదట్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో కారు ఉద్దేశపూర్వకంగానే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని తేలింది. ఒక యువతి కోసం రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నట్లుగా తేలింది. దీంతో డీఎంకే కౌన్సిలర్ మనవడు సహా విద్యార్థులను అరెస్ట్ చేయగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.

వాస్తవానికి వెంకటేశన్ అనే విద్యార్థిని బెదిరించడానికి బయల్దేరితే.. స్నేహితుడు నితిన్ సాయి(19) ప్రాణాలు పోయాయి. తలకు తీవ్ర గాయాలై నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ సాయి.. అభిషేక్ ఒక బైక్‌పై ఉండగా.. వెంకటేశన్ ఇంకో బైక్‌పై ఉన్నాడు. కానీ అభిషేక్ నడుపుతున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారులో ఉన్న నాల్గవ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును రాజకీయ సంబంధంగా చూడలేమని డీఎంకే తెలిపింది. ఇది సామాజిక సమస్య అని.. రాజకీయ సమస్య కాదని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!