Crime News: తాగి వచ్చిన భర్తకు “తలకు మసాజ్” చేయనందుకు భార్య దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మద్యం తాగి వచ్చిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. పిల్లల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 63లో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాగి వచ్చిన హరేంద్ర గిరి(36) అనే వ్యక్తి, తనకు ‘‘తల మసాజ్’’ చేయాలని కోరాడు. అయితే భార్య రీను తాను వంట చేస్తున్నానని, కొంత సమయం తర్వాత చేస్తానని చెప్పడంతో కోపంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు.
వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది, ఐదు, రెండేళ్ల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయోధ్యకు చెందిన ఈ కుటుంబం సెక్టార్ 63లోని ఛజర్సి గ్రామంలో అద్దెకు ఉంటున్నారు. గిరి నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెక్టార్ 63 పోలీస్ స్టేషన్ అధికారి అవధేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 5 ఏళ్ల కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. హత్య సమయంలో రీను అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. వారు ఘటన స్థలానికి చేరుకునేసరికి రీనూ రక్తపుమడుగులో పడి ఉంది. తల్లి శవం పక్కనే కూతుళ్లు ఏడుస్తూ కనిపించారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్‌కి స్పెషల్ ట్రీట్‌మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్‌పై సంచలన వ్యాఖ్యలు…
సోమవారం రాత్రి 10.30 గంటలకు గిరి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు. రీను వంట చేస్తున్నప్పుడు తలకు మసాజ్ చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి కొంత సమయం ఇవ్వాలని కోరడంతో ఇంట్లో ఉంచిన ఇటుకతో ఆమెను కొట్టి చంపేశాడు. పెద్ద కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, చిన్న కుమార్తె నిద్రపోతుందని, మరో కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని, ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
తలకు బలమైన కారణంగానే రీనూ మరణించిందని, అయితే పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తు్న్నామని పోలీసులు తెలిపారు. విచారణలో గిరికి తన ముగ్గురు కూతుళ్లు అంటే ఇష్టం లేదని, కొడుకు కోసం భార్యభర్తల మధ్య తరుచూ గొడవ జరిగేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!