వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో లభ్యమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఐదు నెలల క్రితమే ఆయన వద్ద డ్రైవర్‌గా పని చేసి వదిలేసిన సుబ్రహ్మణ్యం.. రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబీకులు చెప్పారు. నెలకు ఐదు వేలు చొప్పున డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనంత బాబు తమని హెచ్చరించాడని వాళ్ళు తెలిపారు. అయితే, నిన్న రాత్రి…