Nepal Gang: భార్యభర్తలం అంటూ నాటకం.. పని మనుషులుగా చేరి భారీగా చోరీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Gang: హైదరాబాద్‌లో సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపిడీ చేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పని మనుషుల్లా నటించి.. ఆ ఇంటికే స్కెచ్ వేసి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సొత్తు దోచుకు వెళ్లిన గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? పోలీసులు చోరీ సొత్తును మొత్తం రికవరీ చేశారా..? వారి పేర్లు మహేష్ షాహీ, అప్సర. నిజానికి ఇద్దరికీ సంబంధం లేదు. కానీ.. నేపాల్ నుంచి హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఈ జంట.. చోరీలకు స్కెచ్చేశారు. అందుకోసం తాము భార్యభర్తలం అంటూ నాటకం మొదలు పెట్టారు. సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేశారు. అక్కడ పని మనుషులుగా చేరేందుకు ప్రయత్నించారు. చివరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుధ్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతుల ఇంట్లో వారికి ఉద్యోగం దొరికింది.
Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఇక అక్కడి నుంచి తమ స్కెచ్ అమలు చేసేందుకు ఎదురు చూశారు మహేష్ అండ్ అప్సర. ఇంటి యజమానులు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుంటారు? ఎప్పుడు తిరిగి వస్తుంటారు? ఇలా ఈ విషయాలపై రెక్కీ నిర్వహించారు. మరోవైపు అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు ఊటీ, కూర్గ్ తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మార్చి 5న వారిద్దరూ ఇంటికి తాళం వేసి వ్యాపారం పనిమీద ఊటీ వెళ్లారు. ఆ ఇంట్లో 45రోజుల క్రితం భార్యాభర్తమంటూ తోటమాలీగా పనిలో చేరిన మహేష్ షాహీ అలియాస్ ప్రకాష్, అప్సర అలియాస్ మాయ.. మరో ముగ్గురు నేపాలీ గ్యాంగ్ సభ్యుల సహకారంతో మార్చి 13న అర్ధరాత్రి తర్వాత కట్టర్స్, రాడ్స్‌తో ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్‌రూమ్‌లోని అల్మారాలను పగలగొట్టి సుమారు రూ.2కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌లు, రాడో వాచ్‌లు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు.
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత నమోదు
ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రత్యేక బృందాలు దేశంలోని పలు నగరాలతో పాటు నేపాల్ సరిహద్దుల్లో మొహరించారు. కాగా చోరీ సొత్తును తలా కొంత పంచుకున్న నిందితులు ఢిల్లీతో పాటు ఇతర నగరాలకు పారిపోయారు. మహేష్ షాహీ, అప్పర పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటారు. దాదాపు 10 రోజులు వారికోసం కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నేపాల్ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. స్థానిక కోర్టులో వారిని హాజరుపర్చిన అనంతరం విచారించగా చోరీ సొత్తులో కొంతభాగం తీసుకుని నరేష్ అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లాడని తేలడంతో అతడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేష్ షాహీ, అప్సర ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని.. చోరీ స్కెచ్‌లో భాగంగా భార్యాభర్తలుగా సంపన్నుల ఇంట్లో ప్రవేశిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. కాగా చోరీలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోందని తెలుస్తోంది. చోరీ అయిన సొత్తులో కొంత రికవరీ అయినప్పటికీ ఎక్కువ సొత్తు ఇంకా లభ్యం కాకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!