Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
- ముంబై చెంబూర్‌లో దారుణ ఘటన
- ప్రియురాలిపై అనుమానంతో విషం ఇచ్చిన యువకుడు
- కూల్‌డ్రింక్‌లో విషపూరిత మాత్రలు కలిపినట్లు ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన చెంబూర్ ప్రాంతంలో జరిగింది. మృతురాలిని 19 ఏళ్ల విష్ణుమాయగా పోలీసులు గుర్తించారు. ఆమె చనిపోయిన తర్వాత రెండున్నర నెలల గర్భవతిగా తేలింది. ఈ కేసులో ప్రియుడు 25 ఏళ్ల ఆశిష్ మగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 5 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.
ఆగస్టు 25న ఆశిష్ తన ప్రియురాలిని వేరే వ్యక్తితో చూశాడు. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆశిష్ , విష్ణుమాయకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. ఆమె తాగిన తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. సాధారణ అనారోగ్య సమస్యగా కుటుంబం భావించింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read
పోస్టుమార్టం నివేదికలో విష్ణుమాయ విషం తీసుకోవడం వల్లే మరణించినట్లు తేలింది. దీంతో పోలీసుల దర్యాప్తులో హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆశిష్‌తో ఆమెకు ఉన్న సంబంధం, రెండు రోజులు ముందు గొడవ విషయం పోలీసులకు తెలిసింది. ఇదే కాకుండా విష్ణు మాయ స్పృహ కోల్పోయే ముందు తాను ఆశిష్ ఇచ్చిన కూల్ డ్రింక్ తాగినట్లు చెప్పింది. విచారణ సమయంలో పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆశిష్ కట్టుకథలు చెప్పారు. అయితే, దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఆధారాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!