Mumbai : వీళ్లు అసలు మనుషులేనా? డ్రగ్స్ కోసం కన్న బిడ్డనే అమ్ముకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు.. వారు అలా మత్తు కోసం మనుషులు అనే సంగతి కూడా మర్చిపోయారు.. డ్రగ్స్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే అమ్ముకున్నారు.. ఎంత దారుణం..
అసలు విషయానికొస్తే.. తమ రెండేళ్ల కుమారుడితో పాటు నెల రోజుల పసిపాపను విక్రయించారు. తొలుత తమ రెండేళ్ల కుమారుడిని రూ.60వేలకు అమ్ముకున్నారు. నెల రోజుల పసిపాపను కూడా షకీల్ మక్రానీ అనే వ్యక్తికి రూ. 14 వేలకు విక్రయించారు.. ఇదిలా ఉండగా ఈ విషయం కాస్త షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు ఈ విషయం తెలియడంతో ఆగ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా ఖాన్‌తో పాటు ప బిడ్డను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీ, డ్రగ్స్ ఏజెంట్ ఉషా రాథోడ్‌ను అరెస్ట్ చేశారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
వారు అమ్మేసిన పసిపాపను శుక్రవారం ముంబైలోని అంధేరీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ దంపతులు అమ్మేసిన రెండేళ్ల కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. అరెస్టయిన నిందితుల్లో తల్లిదండ్రులు షబ్బీర్, సానియా ఖాన్, షకీల్ మక్రానీ ఉన్నారు. విక్రయం ద్వారా కమీషన్ తీసుకున్న ఉషా రాథోడ్ అనే ఏజెంట్‌ను క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది.డ్రగ్స్‌కు బానిసైన దంపతులు అంధేరీలో డబ్బు సంపాదించడానికి తమ ఇద్దరు పిల్లలను అమ్మేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే, జంట కుటుంబీకులకు కథ వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులు దంపతులు. అసలు పిల్లలను ఎవరు కొన్నారో అనే విషయం ఇంకా తెలియలేదు.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..