Mother Killed Son: కన్నకొడుకునే అతి కిరాతకంగా నరికి చంపిన తల్లి.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother And Son: నవమాసాలు మోసి కనిన తల్లి.. అతడినే చంపింది. మాములుగా కూడా కాదు అతి కిరాతకంగా నరికి చంపింది. కొన్నేళ్ల నుంచి పడుతున్న కన్నీళ్లను కట్టలు తెంచుకొని కసితో కొడుకు అన్న బంధం కూడా గుర్తురాకుండా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసింది. ఇందుకు చిన్న కొడుకు కూడా సాయం చేశాడు. తల్లి కొడుకులు కలిసి పెద్ద కొడుకును ఎందుకు చంపారు. అంతలా అతడు ఏం చేశాడు..? అంటే.. అనంతపురం జిల్లా.. గుంతకల్లు ఆదర్శనగర్‌లో ఒక కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబ పెద్ద కొడుకు భీమేష్. పచ్చి తాగుబోతు. రోజూ తాగొచ్చి తల్లితండ్రి.. తమ్ముడు అని చూడకుండా చితకబాదడం, గొడవ పెట్టుకోవడం, డబ్బుల కోసం వేధించడం చేస్తూ ఉండేవాడు. కన్నకొడుకు ఏం చేసినా తల్లి మందలించడం మాత్రమే చేసేది.
ఇక అలా మందలించిన రోజు భీమేష్ రెచ్చిపోయేవాడు. తల్లి అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చుకొట్టి కొట్టేవాడు. భరించినన్నాళ్లు ఆ కుటుంబం భీమేష్ ను భరించింది. ఇక తమ వలన కాదు అనుకోని రెండు రోజుల క్రితం ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకొంది. చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపడానికి ప్లాన్ వేసింది. ఎప్పటిలానే మొన్నటి రాత్రి కూడా భీమేష్ ఫుల్ గా తాగొచ్చి ఇంట్లో గొడవకు దిగాడు. ఇక ఇదే అదునుగా భావించిన తమ్ముడు వెనుక నుంచి కర్రతో అన్నాను కొట్టి కిందపడేలా చేశాడు.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ఇక తల్లి కత్తి తీసుకొని కొడుకును అతి కిరాతకంగా నరికి చంపింది. ఎవరికి తెలియకుండా ఒక మూటలో శవాన్ని కట్టి ఊరికి దూరంగా పడేయడానికి తల్లీకొడుకులు బయలుదేరగా స్థానికులు మూటను చూసి వారిని ఆపి అడిగారు. ఇక వారికి అనుమానం రావడంతో మూట, బైక్ అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా భీమేష్ శవం కనిపించింది. ఇక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లీకొడుకులు.. భీమేష్ ను తామే చంపామని, తమను ఎంత క్షోభ పెట్టిందో వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!