దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక తల్లి మూఢనమ్మకాలకు పోయి కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మైసూరు జిల్లా హెచ్.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. వీరికి శ్రీనివాస్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే భవాని గత కొన్ని రోజుల నుంచి తనకు దేవుడు పూనుతున్నాడని, కలలోకి వచ్చి ఏవేవో చెప్తున్నాడంటూ చెప్పుకొస్తుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త విడిగా ఉంటున్నాడు. దీంతో కొడుకు శ్రీనివాస్ తో కలిసి భవాని ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేవుడు పూనాడాని చెప్పి ఎవరికి తెలియకుండా కొడుకును అతి కిరాతకంగా కొడవలితో గొంతుకోసి హతమార్చింది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భవానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మైసూర్ లో సంచలనంగా మారింది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!