Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన తర్వాత.. వరుసగా కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగిన విషయం విదితమే..
Read Also: Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!