Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స…