అక్క ప్రియుడి ఇంటికి వెళ్లిన చెల్లి.. తెల్లారేసరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి చెందిన జహీర్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇటీవల ఇంట్లో తెలియడంతో రెండు రోజుల క్రితం అమృత కుటుంబ సభ్యులు జహీర్ వాళ్లింటికి వెళ్లి గొడవపెట్టుకున్నారు. పెద్దవాళ్ళతో పాటు అమృత చెల్లెలు అంజలి కూడా జహీర్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తమ కుటుంబాన్ని జహీర్ కుటుంబం అవమానించడం తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంటికి వచ్చాక తలిదండ్రులు ఇద్దరు కూతుళ్లను ఇలాంటి పని చేసినందుకు తిట్టారు. ఇక ఆ అవమానం భరించలేని అంజలి శనివారం రాత్రి బహిర్బూమికి వెళ్తున్నానని చెప్పి దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో ఆదివారం అంజలి మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!