Minor Girl Assault : ఖమ్మం జిల్లాలో దత్తత పేరుతో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మానవత్వం సిగ్గుపడేలా, నమ్మకం పాతాళానికి పడిపోయేలా జరిగిన ఈ దారుణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విస్సన్నపేట గ్రామానికి చెందిన ముల్లంగి నాగుల్ మీరాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండవ కుమార్తె, 17 ఏళ్ల ముల్లంగి లావణ్యను దత్తత తీసుకోవాలని కేశినేని రమేష్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో ఆ బాలికను తన వద్దకు తీసుకెళ్లిన రమేష్, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో, రెండుసార్లు బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..
ఈ దారుణం గురించి తెలుసుకున్న తల్లి నాగుల్ మీరా, విస్సన్నపేటలో రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబార్షన్ల విషయం బయటపడటంతో, తన కూతురిని ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. అయితే, రమేష్ అక్కడితో ఆగలేదు. లావణ్యను బలవంతంగా ఇంటి నుండి తీసుకెళ్లి ఖమ్మం నగరానికి తీసుకువచ్చాడు. ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఈ వివాదాన్ని ‘సెటిల్‌మెంట్’ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తమ కూతురిని తమకు తప్పకుండా అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేశారు.
కేశినేని రమేష్ వ్యవహారశైలిపై మరిన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికను కిడ్నాప్ చేసి రెండు రోజులు తన వద్ద ఉంచుకొని, ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణతో కలిసి ఖమ్మం పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కారులో మైనర్ బాలికను తరలిస్తుండగా, తల్లి నాగుల్ మీరా కారును ఆపి నిలదీశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి తల్లి, తమ కూతురిని తమకు అప్పగించాలని, కేశినేని రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.