Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’ కేసులో కోర్టు సంచలన తీర్పు..
- భర్తను చంపిన ముస్కాన్, ఆమె లవర్ సాహిల్‌కు మరణశిక్ష విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Blue Drum Murder: దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’ కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను చంపినందుకు భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్లకు బుధవారం మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. హత్య, హత్యకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కోర్టు సెప్టెంబర్ 30న దోషులుగా నిర్ధారించింది. తాజాగా వీరిద్దరికి ఉరిశిక్షను ఖరారు చేసింది.
మార్చి 3, 2025లో ముస్కాన్ రస్తోడి, సాహిల్ కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, అతడి శరీర భాగాలను ముక్కలు చేసి, ఒక బ్లూ డ్రమ్‌లో వేసి దానిని సిమెంట్‌తో ప్యాక్ చేశారు. 15 రోజుల తర్వాత ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 2025లో జిల్లా జడ్జి కోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసులు దాదాపు 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. 126 తేదీలలో విచారణలు జరిగాయి. 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత, సెప్టెంబర్ 19న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శిక్ష విధించింది.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
లండన్ నుంచి వచ్చిన భర్తను చంపేసిన ముస్కాన్, ఆమె లవర్..
సౌరభ్ రాజ్‌పుత్ 2025 ఫిబ్రవరి 24న లండన్ నుంచి మీరట్ తిరిగి వచ్చారు. ఆయన లండన్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సౌరభ్ తిరిగి వచ్చిన తర్వాత రోజు ముస్కాన్ ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న కుమార్తె పీహు పుట్టిన రోజు జరిగింది. ఆ తర్వాత మార్చి 3న ముస్కాన్ సౌరభ్ ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. ఆ తర్వాత సాహిల్ శుక్లా సహాయంతో శరీరాన్ని నాలుగు ముక్కలు చేసి, ఒక నీలి రంగు డ్రమ్‌లో ప్యాక్ చేసి సిమెంట్‌తో కప్పేశారు. మార్చి 4న, కుమార్తె పీహూను వాళ్ల అమ్మమ్మ ఇంట్లో వదిలేసి సాహిత్లో ముస్కాన్ హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. మార్చి 17న ముస్కాన్ ఇంట్లో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత మార్చి 18న పోలీసులు డ్రమ్ములో సౌరభ్ మృతదేహాన్ని కనుగొన్నారు.
కీలక సాక్ష్యాలు..
ఈ కేసులో నీలి రంగు డ్రమ్ము, ట్రాలీ బ్యాగ్ ఆధారాలుగా మారాయి. వీటిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీని తర్వాత 2026లో వీరిద్దరి కాల్ వివరాలు, చాట్ హిస్టరీ, మొబైల్ లొకేషన్ సమాచారంతో కోర్టుకు నివేదిక సమర్పించారు. ఏప్రిల్ 21న ముస్కాన్, సాహిల్ లపై ఆరోపణలను కోర్టు విచారించింది. 32 ఏళ్ల జైలు శిక్ష పడే ఈ ఆరోపణల్ని ఇద్దరూ అంగీకరించారు. పోలీసులు 34 మంది సాక్షుల పేర్లతో 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.సౌరభ్ సోదరుడు బబ్లూ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు, వైద్యులు, డ్రమ్ అమ్మేవారు ఇలా అందరి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని దోషులుగా కోర్టు నిర్దారించింది.
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..