మహారాష్ట్రలో దారుణం జరిగింది. వైద్య వృత్తికే కళంకం తెచ్చే దిగ్భ్రాంతి ఘటన జరిగింది. సహచర విద్యార్థినికి తోడుగా ఉండాల్సిన స్నేహితులే కాటేశారు. కామంతో కళ్లు నెత్తికెక్కిన విద్యార్థులు అఘాయిత్యాకి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి సహచర విద్యార్థినిపై ముగ్గురు వైద్య విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: NITI Aayog: నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. హాజరుకానున్న సీఎంలు
కర్ణాటకలోని బెలగావికి చెందిన బాధితురాలు (22) మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ చదువుతోంది. మే 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు మగ వైద్య స్నేహితులతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంది. అయితే అందులో ఒకడు.. ఆమెను ప్లాట్‌కు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్నప్పుడు ఆమెకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోంచి బయటకు వచ్చాక.. జరిగిన ఘోరాన్ని ప్రశ్నించింది. అంతే ముగ్గురు నిందితులు ఆమెపై బెదిరింపులకు దిగారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.
ఇది కూడా చదవండి: NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్‌ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
దీంతో చేసేదేమీలేక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారు విశ్రాంగ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. దీంతో పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం.. మే 27 వరకు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించిందని ఒక అధికారి తెలిపారు. నిందితులంతా 20-22 ఏళ్ల వయసు వారిని పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా.. బాధితురాలి క్లాస్‌మేట్సేనని చెప్పారు. పూణె, షోలాపూర్, సాంగ్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని చెప్పారు. ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆమెకు మద్యం తాగించారని.. ఆమె మత్తులోకి జారుకున్నాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్‌రేప్ చేసినట్లుగా వెల్లడించారు. లైంగిక దాడి గురించి చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిందితులు బెదిరించారని అధికారి తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.