Drugs seized: పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆటకట్టించిన పోలీసులు
- 1143 కిలోల గంజాయి స్వాధీనం
- గంజాయి విలువ రూ. 23 కోట్లు ఉంటుందని అంచనా
- ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు వేసి మరీ దందా చేస్తున్నారు. వేలు కాదు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల గంజాయిని సరిహద్దులు.. అవసరమైతే దేశాలు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి ముఠాల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఒడిశాలో ఏకంగా 200 కోట్ల రూపాయల విలువైన హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్ పోర్టులో 23 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారు.
పోలీసులు రాకుండా ఉండే చోటు.. దీన్ని గంజాయి హ్యాష్ ఆయిల్ తయారీ కేంద్రంగా ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఒడిశాలోని జోలాపుట్ రిజర్వాయర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హష్ ఆయిల్ తయారీ యూనిట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 1800 లీటర్లకు పైగా హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.200 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఇక హాష్ ఆయిల్ మాత్రమే కాదు.. అదే ప్రాంతంలో వెయ్యి కిలోలకుపైగా గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.5 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. హాష్ ఆయిల్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, డ్రమ్ములు, రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని కూడా సీజ్ చేశారు.
ఈ యూనిట్ ఉన్న ప్రాంతం పూర్తిగా అడవి మధ్యలో ఉండటంతో అక్కడికి చేరుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. రోడ్డు మార్గం లేకపోవడంతో ముందుగా పడవల ద్వారా జోలాపుట్ రిజర్వాయర్ దాటి, అనంతరం పలు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితులకు సమాచారం లీక్ కాకుండా ప్రత్యేక వ్యూహంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు ఒడిశా పోలీసులు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ హష్ ఆయిల్ తయారీ కేంద్రానికి అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు పోలీసులు. ఇక అదే జిల్లాలోని నంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో పెద్ద ఎత్తున గంజాయి రవాణా కేసును పోలీసులు వెలికితీశారు. 1143 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు కొరాపుట్ జిల్లా సెమిలిగూడ ప్రాంతానికి చెందిన సరఫరాదారులు కాగా.. మరో ఇద్దరు హర్యానా రాష్ట్రానికి చెందిన రిసీవర్లు ఉన్నారు.
మరోవైపు ఢిల్లీలో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా అనిపించిన రెండు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది. బ్యాగ్ లో కొన్ని ప్యాకెట్లను గుర్తించారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. ఆ ప్యాకెట్లను పార్సిల్ కవర్ల మాదిరిగా ప్యాక్ చేశారు. అంటే.. షాపింగ్‌లో కొన్న వస్తువుల మాదిరిగా.. సిల్వర్ కవర్ల లో వాటిని ప్యాక్ చేశారు. స్కానింగ్‌లో ఆ ప్యాకెట్లు కనిపించడంతో.. రెండు బ్యాగులను పూర్తిగా తనిఖీ చేశారు. అందులో ఉన్న ప్యాకెట్లను ఓపెన్ చేసి చూడగా షాక్..!! గుట్టుచప్పుడు కాకుండా హైడ్రోఫోనిక్ గంజాయిని వేర్వేరు ప్యాకెట్లుగా మార్చి.. అనుమానం రాకుండా తరలించే ప్రయత్నం చేశారు ఇద్దరు యువకులు.
బ్యాంకాక్ నుంచి వస్తున్న ఆ ఇద్దరూ.. బ్యాంకాక్‌లో 23 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని అక్కడే ప్యాకెట్లుగా మార్చారు. వాటిని లగేజ్ బ్యాగుల్లో ఉంచి ప్యాక్ చేసి.. అనుమానం రాకుండా తరలిద్దామనుకున్నారు. కానీ.. ఎయిర్‌పోర్ట్ లో భద్రతా సిబ్బంది చేసిన తనిఖీలో అడ్డంగా దొరికిపోయారు…
పట్టుబడ్డ గంజాయి విలువ ఏకంగా 23 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గంజాయిని సీజ్ చేసి.. ఇద్దరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. ఢిల్లీకే తీసుకొస్తున్నారా..? ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా తరలించాలని ప్లాన్ చేశారా..? అనేది దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!