Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
- భార్యను తన నుంచి విడదీశారనే కోపం..
- అత్తమామల్ని చంపేందుకు ఆన్‌లైన్‌లో బాంబుల తయారీ..
- బాంబు పేలడంతో ఇద్దరి గాయాలు..
- నిందితులను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్‌లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.
నిందితుల నుంచి మరో రెండు బాంబులు, కంట్రీమేడ్ పిస్టర్, క్యాట్రిడ్జ్‌లు, ఆయుధాల తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపన్ రావు భార్య విడాకులు తీసుకుంటోంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో ఉంది. సుఖాడియా తనకు, తన భార్యకు మధ్య విభేదాలు సృష్టించి తనకు, తన పిల్లలకు దూరం చేసిందని రూపర్ రావు నమ్మాడు. తన భార్య, అత్తమామలు, బావమరిది కడుపునొప్పి కారణంగా తాను బలహీనపరిచారని నిందితుడు భావించినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Zia Ur Rehman Barq: విద్యుత్ దొంగతనం.. సమాజ్‌వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..
నిందితుడు సుఖాదియా, అతని అత్తమామలను చంపడానికి, తన భార్యను ఆమె కుటుంబ నుంచి వేరు చేయడానికి, ఆమెను ఒంటరి చేయడానికి మూడు నాలుగు నెలల్లో ఇంటర్నెల్‌లో చూసి బాంబులు, ఆయుధాల తయారీని నేర్చుకోవడం ప్రారంభించినట్లు విచారణ తేలింది. రూపన్ రావుతో పాటు సహ నిందితులు సల్ఫర్ పౌడర్, బ్లేడ్లు, బ్యాటరీలు, బొగ్గు, బాణాసంచా నుంచి గన్‌పౌడర్ వంటి పదార్థాలను ఉపయోగించి రిమోట్ కంట్రోల్డ్ బాంబులను తయారు చేసిన కుట్ర పన్నారు.
రూపన్ రావుకి రోహన్ రావల్(21), గౌరవ్ గాధవి సహకరించాడు. శుక్రవారం రాత్రి సుఖాడియా ఇంటికి రావల్ మొదట బాంబు ఉన్న పార్సిల్‌ని తీసుకెళ్లాడు. అయితే, వారి టార్గెట్ ఇంట్లో లేకపోవడంతో పార్సిల్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ మరుసటి రోజు పార్సిట్ డెలివరీ చేయడానికి గాధమిని పంపించారు. రావల్ వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చారు. రూపన్ రావు తన అత్తమామల్ని, బావమరిదిని కూడా ఇదే విధంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు.
పేలుడు ఘటన తర్వాత గాధవిని స్పాట్‌లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వెంబడిస్తున్నప్పుడు, పోలీసులు ఒక కారు నుంచి రెండు లైవ్ బాంబుల్ని కనుగొన్నారు. వాటిని తర్వాత నిర్వీర్యం చేశారు. అదే కారులో కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..