Man Executed Lover’s Husband: వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్త హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Executed Lovers Husband In Kakinada: అతడు ఒక డ్రైవర్. భార్య అంటే అతనికి ఎంతో ఇష్టం. భార్యకు లోటు లేకుండా, ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కానీ, భార్య మాత్రం అతని కళ్లుగప్పి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పని నిమిత్తం భర్త ఇళ్లు వదిలి బయటకు వెళ్లినప్పుడల్లా.. తన ప్రియుడితో కాలం గడిపేది. ఆమె పెట్టుకున్న ఆ వివాహేతర సంబంధం భర్త పాలిట శాపంగా మారింది. అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మల్లిసాలకు చెందిన బొల్లం శివప్రసాద్ అలియాస్ శివ (27) ఒక వ్యాన్ డ్రైవర్. ఇతడు తన భార్యతో కలిసి సుఖంగా జీవనం సాగిస్తున్నాడు.
అయితే.. శివ భార్య అప్పుడప్పుడు కాట్రావులపల్లిలోని తన పుట్టింటికి వెళ్తుంటుంది. అక్కడే ఆమెకు ఐస్‌క్రీములు అమ్ముకునే అప్పలరాజు అలియాస్ అప్పన్నతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అది వివాహేతర సంబంధంగా మారింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. వీళ్లు తమ వివాహేతర బంధాన్ని కొనసాగించారు. అయితే.. వేరే ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లాలని శివ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అతడు తన భార్యకు చెప్పగా.. ఆమె తన ప్రియుడు అప్పన్నకు తెలియజేసింది. దీంతో.. వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోతే, తన ప్రియురాలు దూరమవుతుందని అప్పన్న భావించాడు. ఈ విషయమై శివ భార్య, అప్పన్న మధ్య గంటలకొద్దీ సంభాషణలు జరిగాయి. ఈ క్రమంలోనే శివని హతమార్చాలని అప్పన్న పక్కా స్కెచ్ వేసుకున్నాడు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
తొలుత.. శివ ఇంటికి వచ్చే సమయానికి ఇంటి గేటుకి కరెంటు పెట్టి హతమార్చాలని ప్లాన్ చేశాడు. కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి నేరుగా ఎటాక్ చేద్దామని, అతని ఇంటి వద్దే కాపు కాశాడు. శివ ఇంటికొచ్చి నిద్రపోతుండగా.. అప్పన్న కత్తితో పొడిచి హతమార్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ చేసిన తర్వాత, భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో భార్య ప్రమేయం ఉందా? లేక అప్పన్న ఒక్కడే శివ హత్యకు పన్నాగం పన్నాడా? అనే అంశంపై విచారణ జరుగుతోంది. పాపం.. భార్యని ప్రేమగా చూసుకున్న పాపానికి, ఆమె పెట్టుకున్న వివాహేతర సంబంధానికి బలయ్యాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!