Maharashtra: 105కి బదులుగా, 205 రూంకి వెళ్లిన మహిళ.. సామూహిక అత్యాచారం..
- మహారాష్ట్రలో దారుణం..
- పొరపాటున వేరే గదికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్..
- ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక మహిళ తన స్నేహితురాలిని హోటల్‌లో కలిసేందుకు వెళ్లిన సమయంలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్‌లో జరిగింది. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ, తన స్నేహితురాలి నుంచి డబ్బు తీసుకునేందుకు హోటల్‌కు వెళ్లింది.
Read Also: Bangladesh Violence: బంగ్లా మిషన్ ముందు ఆందోళన.. 1971ని గుర్తు చేసిన భారతీయులు..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
బాధితురాలి స్నేహితురాలు హోటల్‌లోని 105 గదిలో ఉంది. అయితే, తన స్నేహితురాలి గది నుంచి బయటకు వచ్చి తర్వాత, గందరగోళానికి గురైన మహిళ, పొరపాటున రెండో అంతస్తుకు వెళ్లింది. తాను మళ్లీ తన స్నహితురాలి గదికే వచ్చానని భావించి, 205 రూం తలుపు తట్టింది. గదిలో ఘనశ్యామ్ భౌలాల్ రాథోడ్, రుషికేశ్ తులసీరామ్ చవాన్, కిరణ్ లక్ష్మణ్ రాథోడ్ అనే ముగ్గురు వ్యక్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు. తలుపు తెరిచి చూడగా, తాను ఎక్కడికి వచ్చానో తెలియక మహిళ గందరగోళంలో కనిపించింది.
నిందితులు, మహిళను గదిలోకి లాక్కెళ్లి బలవంతంగా వారితో పాటు మందు తాగించారు, రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఆమె వారి నుంచి తప్పించుకుంది. గదిలో నుంచి తప్పించుకున్న మహిళ కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వేదాంత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!