Mahadev Betting App: గతేడాది జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో ఇటీవల అరెస్టు చేశారు.
మహాదేవ్ యాప్‌కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు.