Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఆస్తి కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. కన్నవాళ్లనే కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఇలాంటి ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తిలో వాటా తగ్గిపోతుందనే కోపంతో ఓ కొడుకు తన 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా గది తలుపులు మూసేయడంతో ఆ వృద్ధుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోగల్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 14న ఓ గదిలో వృద్ధుడి సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని డూడేశ్వర్ ఖోబ్రాగడేగా గుర్తించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన చిన్న కుమారుడు అనిల్ ఖోబ్రాగడేను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని వెల్లడైంది. డూడేశ్వర్ తన కుమార్తె అనుసూయకు ఇంటి పక్కనే ఉన్న కొంత భూమిని ఇచ్చారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. అయితే తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం చిన్న కుమారుడు అనిల్‌కు నచ్చలేదు. అక్కకు భూమి ఇవ్వడం వల్ల తనకు ఆస్తిలో వాటా తగ్గిపోతుందని భావించి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా భార్యను, అక్కను తండ్రికి భోజనం ఇవ్వకుండా అడ్డుకునేవాడని పోలీసులు తెలిపారు.
Also Read
- Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
- School Reunion Turns Tragic: స్కూల్ రీయూనియన్‌లో పరిచయం.. ప్రేమ, అనుమానం, అసూయతో డబుల్ మర్డర్..!
- Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
ఈ క్రమంలో నవంబర్ 13 రాత్రి అనిల్ తన తండ్రి గదిలోకి వెళ్లి ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత గది తలుపులు మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నడవడానికి కూడా సరిగ్గా వీలులేని వృద్ధుడు మంటల నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం అక్క తండ్రికి భోజనం ఇవ్వడానికి వెళ్తుండటాన్ని గమనించిన అనిల్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో తండ్రిని తానే కాల్చి చంపినట్లు అనిల్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనితో నిందితుడిని జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!