Love Today Scene Repeat: సినిమా స్టోరీలు నిజ జీవితంలో రిపీట్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొందరు సినిమాల్లోని సీన్లను ఫాలో అయిపోతుంటారు.. అవి కొన్ని సార్లు మంచి చేస్తే.. ఇంకా కొన్నిసార్లు గుట్టును విప్పి రచ్చ చేస్తాయి.. ఇక, ఈ మధ్యకాలంలో లవ్ టుడే సినిమా సంచలనమే సృష్టించింది.. ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న కథ చుట్టే ఈ సినిమా తిరుగుతుంది.. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు పెడుతుంది.. అది విడిపోయేవరకు దారి తీసినా.. చివరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మళ్లీ ఇద్దరు కలిసేలా చేస్తుంది.. ఎంతైనా అది సినిమా.. కానీ, అదే సీన్ నిజజీవితంలో రిపీట్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తమిళనాడులో లవ్ టుడే సినిమా సీన్ రిపీట్ అయ్యింది.. సినిమా తరహాలో ఫోన్ మార్చుకున్నారు ప్రేమికులు.. సేలం జిల్లా వాజప్పాడి ప్రైవేట్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అరవింద్.. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అమ్మయితో ప్రేమలో పడ్డాడు.. ఆ ప్రేమను పెళ్లి వరకు నడిపించాలనుకున్నారు.. తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైంది ఆ ప్రేమ జంట.. అక్కడి వరకు బాగానే ఉంది.. అసలు కథ అప్పుడే మొదలైంది.. పెళ్లి ఫిక్స్ అయిన సంతోషంలో లవ్ టుడే సినిమా తరహాలో ఇద్దరు సెల్‌ఫక్షన్లు మార్చుకున్నారు.. అయితే, ప్రియుడు అరవింద్ సెల్ ఫోన్‌లో పదో తరగతి చదివే అమ్మాయి న్యూడ్ ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి.. న్యూడ్ ఫోటోలతో పాటు సదరు బాలికతో అరవింద్ రోమాన్స్ చేసే వీడియోలు చూసి కంగుతున్న ప్రియారాలు.. తనను మోసం చేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని.. తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది.. ఈ వ్యవహారంపై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఇక, ఫిర్యాదు మేరకు వజప్పాడి పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ అరవింద్‌ను అరెస్టు చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తంగా లవ్ టుడే సీన్ రిపీట్ అయ్యింది.. కానీ, కథ మాత్రం సుఖాంతం కాలేదన్నమాట.