LB Nagar Police Officials Raids In Signature Beauty Parlour: బయటి నుంచి చూడ్డానికేమో అదొక బ్యూటీ పార్లర్.. కానీ లోపల చేసేవన్నీ పాడు పనులే! పోలీసులకు చిక్కుండా ఉండేందుకు, బ్యూటీ పార్లర్ అంటూ కలరింగ్ ఇస్తూ.. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపించారు. కానీ, వీరి చీకటి రహస్యం ఎన్నాళ్లో దాగలేదు. పోలీసులకు సమాచారం అందడంలో.. ఒక్కసారిగా దాడులు చేసి, ఈ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్ సమీపంలో ‘సిగ్నేచర్’ అనే ఒక బ్యూటీ పార్లర్ ఉంది. చాలాకాలం నుంచి నడుస్తున్న ఈ బ్యూటీ పార్లర్‌లో.. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నట్టు తెలిసింది. దీంతో.. ఎల్బీనగర్ (SOT) పోలీసులు దానిపై దాడులు చేశారు. లోపల కనిపించిన దృశ్యాలను చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. విటుడిని అదుపులోకి తీసుకుని, అతడ్ని సరూర్ పోలీసులకు అప్పజెప్పారు. అతనిపై కేసు నమోదు నమోదు చేసి.. రిమాండ్‌కి తరలించారు. పట్టుబడ్డ ఆ విటుడు.. పట్టుపడ్డ విటుడు ఓ క్లాత్ షోరూమ్ ఓనర్‌గా తేలింది.
అయితే.. ఆ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు మాత్రం పారిపోయారు. ఈ దాడి విషయం తెలియగానే.. గుట్టు చప్పుడు కాకుండా, వెంటనే పరారయ్యారు. దీంతో.. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే.. ఇంకా ఏయే ప్రాంతాల్లో ఇలాంటి వ్యభిచార గృహాలున్నాయన్న దానిపై ఫోకస్ పెట్టారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేదే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.