Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korukonda Tragedy: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పర్వదినం విషాదాన్ని నింపింది. గానుగూడెం గ్రామానికి చెందిన గొనిపాటి శివ (38), సోడదాసి వీరబాబు (35) వినాయక చవితి పూజ కోసం కలువ పువ్వులు సేకరించేందుకు గ్రామ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తూ లోతైన ప్రాంతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కోరుకొండ ఎస్ఐ ఆర్. శివాజీ వెల్లడించారు. మృతుడు శివకు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉండగా, వీరబాబు తన వృద్ధ తల్లిదండ్రులకు ఆధారంగా జీవిస్తున్నాడు. ఇద్దరి ఆకస్మిక మృతితో తూర్పుగానుగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వినాయక చవితి పూజ కోసం పూలు తీసుకురావడానికి వెళ్లిన ఇద్దరూ తిరిగి రాకపోవడంతో తూర్పుగానుగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ వేళ జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!