దారుణం: ఆ పనికి ఒప్పుకోలేదని.. చర్చికి పిలిచి యాసిడ్ పోసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే షీబాకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయాన్ని అరుణ్ వద్ద దాచిపెట్టి చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే నిజం ఎక్కువ రోజులు దాగలేదన్నట్లు ఒకరోజు షీబా గుట్టు బయటపడింది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుందని తెలుసుకున్న అరుణ్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో అతడిపై రగిలిపోయిన ఆమె అరుణ్ ని బెదిరించడం మొదలు పెట్టింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తనను పెళ్లి చేసుకోకపోతే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసింది. ఇక దీంతో అరుణ్ తన స్నేహితుడిని తీసుకొని ఒక చర్చి వద్ద డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ మరోసారి వీరిద్దరి మధ్య పెళ్లి చర్చ జరిగింది. షీబాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు అరుణ్. దీంతో రగిలిపోయిన ఆమె తనతో తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ని అతడి ముఖంపై కొట్టడంతో అతడి ముఖం సగం కాలిపోయింది. ప్రస్తుతం అరుణ్ కుమార్‌కు తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స జరగుతుంది. యాసిడ్ దాడిలో అరుణ్ కుమార్ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. షీబాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!