రోజు రోజుకు సమాజంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి కఠిన మైన చట్టాలు తీసుకొచ్చినప్పటికి..కొందరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే మహిళపై.. తామ కామ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో.. స్కానింగ్ కు వచ్చిన మహిళపై.. అక్కడున్న రేడియాలజీ నిర్వాహాకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో స్కానింగ్ కోసం తన భర్తతో కలిసి రేడియాలజీ సెంటర్ కు వచ్చింది. అయితే మహిళ లోపలికి వెళ్లగా.. ఆమె భర్త బయట కూర్చుని ఉన్నాడు. అయితే అక్కడే ఉన్న స్కానింగ్ సెంటర్ నిర్వాహాకుడు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. బెదిరించినట్లు సమాచారం. అయితే మహిళ ఇదంతా వీడియో తీసింది. అనంతరం తన భర్తతో కలిసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది.
Read Also:Heart Attack: తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసా..
మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపడుతున్నామని తెలిపారు. అయితే ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. పోలీసులు చర్యలు తీసుకోవడంపై బాధితులు మండిపడ్డారు. అనంతరం స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో.. సదరు నిర్వాహాకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.