గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ సముద్ర తీరం…డ్రగ్స్ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా ? విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్…గుజరాత్ ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోందా ? కచ్ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.
గుజరాత్ తీరం…డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిపోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఇటీవల కాలంలో వరుసగా…వందల కోట్ల విలువ చేసే…గంజాయి గుజరాత్ తీరం పట్టుబడింది. వారం రోజుల క్రితం 4వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కోస్ట్‌గార్డు పట్టుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ మాదకద్రవ్యాలతో భారత జలల్లాలోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును పట్టుకున్నారు. ఈ బోటులో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో… ఒకరు కరాచీ డ్రగ్స్ డాన్ హజి హసన్ కుమారుడు మహ్మద్ సాజిద్ వాఘెర్ గుర్తించారు.
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
కరాచీకి చెందిన హజీ హసన్… స్థానికంగా అతిపెద్ద డ్రగ్ డీలర్. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు. గతంలో దుబాయిలో ఓ డ్రగ్స్ కేసులో అరెస్టయి ఐదేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు. తాజాగా భారత్‌కు రవాణా చేస్తున్న సరకుతో పాటు తన కొడుకు సాజిద్‌ను పంపించాడు. సాజిద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మత్స్యకారుల ముసుగులో 77 కిలోల హెరాయిన్‌ను ఫిషింగ్ బోటులో తీసుకుని కరాచీ పోర్ట్ నుంచి బయల్దేరారు.
అయితే కచ్ జిల్లా జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. అనుమానాస్పదంగా కన్పించడంతో తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సాజిద్, మిగతా వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డగించి అదుపులోకి తీసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!