Pastor arrested: అమ్మయిలను ట్రాప్ చేయడం, చర్చ్ కి వచ్చిన పెళ్ళి జంటలను పెళ్లి చేసి వధువలతో మొదటి రాత్రి తనతో పడుకోవాలని లేదంటూ అరిష్టం జరుగుతుందని ఇది ప్రభువు నాతో చెప్పాడంటూ వధువులను, చెర్చ్‌కు వచ్చే యువతులను మోసం చేసి వారిపై తన కామవాంఛను తీర్చుకోవడం ప్రారంభించాడు. అది నమ్మిన చాలామంది పాస్టర్ చెప్పేది నిజమే నేమో లేదంటే అరిస్టం జరుగుతుందని గుడ్డిగా నమ్మి అతనితో ఉండే రోజులు కూడా ఉండటం గమనార్హం. ఇదే రూట్ లోనే తన పని కానిచ్చేవాడు పాస్టర్. ఒక యువతి పాస్టర్ భాగోతాన్ని బయటపెట్టడంతో చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి పాస్టర్ ను అదుపులో తీసుకున్నారు. ఈఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Read also: Inter student: పండుగ పూట విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. వారే కారణమంటూ లేఖ
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని విలవన్కోడ్‌కి చెందిన బెనెడిక్ట్ జిల్లాలోని కొన్ని చర్చిల్లో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అందరి దృష్టి తనపై పడేలా, తనమాటే ప్రభువు మాట అన్నట్లు చర్చ్‌కు వచ్చేవాళ్లను నమ్మించాడు. అది నమ్మని కొందరు యువతులు బెనెడిక్ట్ తో వారి సమస్యలను అన్నీ చెప్పుకునే వారు. ఇదే అలుసుగా భావించిన పాస్టర్ బెనెడిక్ట్. మీకు పెళ్లి జరుగుతుంది కానీ మొదటి రాత్రి మాత్రం తనతో జరగాలని లేదంటే మీకు మంచి జరగదని నమ్మబలికాడు. కొన్ని రోజుల కిందట పెళ్లైన ఓ యువతిని ఈ పాస్టర్ లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇతని గుట్టు రట్టైంది. అసభ్యకరంగా మాట్లాడిన, ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బెనెడిక్ట్ పాస్టర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పాస్టర్ చాలా మంది మహిళలను లైంగికంగా వేధించిన ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు.
చర్చ్ కి వచ్చి పెళ్ళి చేసుకుని అమ్మాయిలను బుట్టలో వేసుకుని పెళ్ళి తరువాత తనతో మొదటి రాత్రి గడపాలని తరువాత భర్తతో ఉంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఇదే ప్రభువు నాకు చెప్పాడంటూ మోసం చేసి తన కామవాంఛను తీర్చుకుని ఆ తర్వాత ఆ విడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ మహిళలను వాడుకుంటున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలిందని చెప్పారు. తాజాగా ఈ పాస్టర్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో 18 ఏళ్ల యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులకు భయపడిన పాస్టర్ బెనెడిక్ట్ పారిపోయి ఓ ఫామ్‌హౌస్‌లో దాక్కున్నాడని, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి పాస్టర్లను నమ్మవద్దని. పవిత్రమైన చర్చ్‌లో ఇలాంటి కామవాంఛ పాస్టర్లకు దూరంగా ఉండాలని కోరారు. ఇలాంటి వారి వల్ల చర్చ్ లో వుండే మిగతావారిపై కూడా ఇటువంటి ఆలోచనలనే వస్తాయని పోలీసులు తెలుపుతున్నారు. యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Inter student: పండుగ పూట విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. వారే కారణమంటూ లేఖ