Instagram Murder: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, స్నేహం, లవ్ ఒక మైనర్ బాలిక హత్యకు కారణమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్న యువకుడు ఆమెను హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం ఆమె మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అన్షుగౌతమ్ అతడి ఫ్రెండ్స్ ఆషిక్, వైభవ్, రిషబ్‌లుగా గుర్తించారు.
Read Also: Vizag Crime: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. 12 ఏళ్ల తర్వాత యూపీలో దొరికిన నిందితుడు..
అన్షు ఇన్‌స్టాలో బాధిత బాలికతో స్నేహం చేశాడు. అతను తన కూతురితో మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలో మాట్లాడేవాడని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కుమార్తెను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. తన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్షు కుటుంబ సభ్యుల్ని సంప్రదించానని, కానీ వారి నుంచి ఎలాంటి సాయం లభించలేదని వెల్లడించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారాంగా పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అన్షు,అతడి ఫ్రెండ్స్ ఒక వివాదం తర్వాత బాలిక గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడవేసినట్లు అంగీకరించారు. నిందితులపై పోక్సో చట్టంతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.