Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: సాధారణంగా హత్య కేసుల్లో ఆయుధాలు, విషప్రయోగం ఇతర మార్గాలు కనిపిస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన శివాని హత్య కేసు మాత్రం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. భార్యను హత్య చేసినా అది నార్మల్ డెత్ లా కనిపించాలని భావించిన భర్త, అందుకోసం ఏకంగా 620 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి విషపూరిత నాగుపామును కొనుగోలు చేయడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఇండోర్‌కు చెందిన అమితేష్ అలియాస్ షాలు పటేలియా తన భార్య శివానిని హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతడు రాజస్థాన్‌లోని అల్వార్‌కు వెళ్లి అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి రూ.5 వేల చెల్లించి నాగుపామును కొనుగోలు చేశాడు. అనంతరం ఆ పామును జాగ్రత్తగా ఇండోర్‌కు తీసుకువచ్చి, ఇంట్లోనే 11 రోజుల పాటు దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
పథకం ప్రకారం ఒక రోజు భార్యను గొంతు నులిమి హత్య చేసిన అమితేష్, ఆ తర్వాత ఆమె మృతి పాముకాటు వల్ల జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం నాగుపాముతో శివాని చేతిని కాటు వేయించాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పాము కాటు వేయకపోవడంతో పామును కూడా చంపి, దాని విషాన్ని భార్య చేతిపై పూసి, అది నిజంగా పాముకాటుతో జరిగిన మరణంలా కనిపించేలా నాటకం ఆడినట్లు దర్యాప్తు వెల్లడించింది.
అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు, వైద్య పరీక్షలు, సేకరించిన సాక్ష్యాలు అమితేష్ చెప్పిన కథనాన్ని పూర్తిగా తప్పుబట్టాయి. చివరకు ఇది పథకం ప్రకారం జరిగిన హత్యేనని నిర్ధారణ కావడంతో కోర్టు అతడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన 2019 డిసెంబర్ 1న జరిగినప్పటికీ, సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పుడు తీర్పు వెలువడింది.
ఈ కేసు మరో కీలక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అమితేష్ నేరుగా అల్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి విషపూరిత నాగుపామును సులభంగా కొనుగోలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అల్వార్‌లో విషసర్పాల అక్రమ విక్రయం జరుగుతోందా? పాముల స్మగ్లింగ్‌కు సంబంధించి ఏదైనా నెట్వర్క్ పనిచేస్తోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల ముందున్నాయి. ఈ కేసులో పామును విక్రయించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, అతడు ఇప్పటివరకు చిక్కలేదు. దీంతో ఈ హత్య కేసు కేవలం ఫ్యామిలీ వివాదంతో ముగియకుండా, విషసర్పాల అక్రమ వ్యాపారంపై కూడా కొత్త చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!