Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం
- అంబరాన్నంటిన సంబరాలు
- మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత సమాజంలో మగపిల్లాడిపై ఉండే మక్కువ ఆడపిల్లలపై ఉండడం లేదు. ఆడబిడ్డ అని టెస్ట్‌ల్లో తేలితే చాలా మంది గర్భాన్ని తొలగించేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక కుటుంబం అలాంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి కొత్త ఆదర్శాన్ని నెలకొల్పారు. దాదాపు నాలుగు తరాల తర్వాత.. అనగా 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆస్పత్రి నుంచి ఇంటికి సంబరాలతో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Also Read
- PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
- Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
- Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
- Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దహిఫాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదో తరంలో కుమార్తె పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం ఉప్పొంగిపోయారు. పాపను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో రథంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాల మధ్య బంధువులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఇక పాపకు ‘గార్గి’ అని నామకరణం చేశారు. ఆడబిడ్డ జన్మించగానే కుటుంబమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించినట్లుగా అమ్మమ్మ సురేఖ దహిఫాలే తెలిపింది. చాలా మంది అబ్బాయి పుడతాడని ఆశిస్తారని.. కానీ అమ్మాయి పుట్టినప్పుడు కలిగే ఆనందం వేరు అని గార్గి తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు తండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారన్నారు. అందుకే తాను ఎప్పుడూ అమ్మాయినే కోరుకున్నట్లు చెప్పారు.
‘ఇది మా అదృష్టం’..
గార్గి తాత లింబాజీ దహిఫలే చిన్నారిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కుటుంబంలో ఆడపిల్ల ఉండటం ఎంతో అదృష్టం. ఇన్నేళ్లుగా మా కుటుంబంలో ఆడపిల్ల లేదనే బాధ ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని ఆయన అన్నారు. తన ఇద్దరు కోడళ్లను కూడా సొంత కుమార్తెల్లాగే చూసుకున్నానని లింబాజీ తెలిపారు. ఇప్పుడు తన మనవరాలిని రథంలో సంగీతం, నృత్యాల మధ్య ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గార్గి నాయనమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ.. చిన్నారి జన్మించిన విషయం తెలిసిన వెంటనే ఆమెను ఎంతో ఘనంగా ఇంటికి తీసుకురావాలని ఆస్పత్రిలోనే నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘‘ఈ రోజు మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం’’ అని ఆమె అన్నారు.
సానుకూల సందేశం ఇచ్చిన కుటుంబం
ఆడపిల్లల జననంపై ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల్లో సంకుచిత ఆలోచనలు ఉన్నాయని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దహిఫలే కుటుంబం గార్గి జననాన్ని ఘనంగా వేడుకగా నిర్వహించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశం ఇచ్చిందని ప్రశంసించారు.
తాజావార్తలు
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
ట్రెండింగ్
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!