హైదరాబాద్ పాతబస్తీలో కొత్త కొత్త కల్చర్ వెలుగులోకి వస్తోంది. సోషల్ మీడియా ప్రభావమో… స్నేహం వల్లో యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. అనైతికమైన సంబంధాలలో మునిగితేలుతున్నారు యువకులు. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు యువకుల మధ్య బంధం స్వలింగసంపర్కానికి దారిదీసింది. ఓ యువకుని పెళ్ళి సమయంలో 10 లక్షలు ఆర్థిక సహాయం చేశాడు మరో యువకుడు. కొన్నాళ్ళుగా ఇద్దరూ విడిగా వుంటున్నారు. మరో యువకుడు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అడిగినంత ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంచలనం కలిగించిన ఈ కేసు శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
శాలిబండకు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో ఆ యువకునికి మొఘల్‌పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరు యువకులు మధ్య జరిగిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. శాలిబండకుచెందిన యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఒక్కటయ్యారు. స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. అనంతరం శాలిబండకు చెందిన యువకునికి మరో యువతితో రెండవ వివాహం జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది.
దీంతో మళ్ళీ వీరిరువురు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం కొనసాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్‌పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు 10 లక్షలు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్‌పురా వాసి తనతో నగ్నంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని .. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే నంటూ బ్లాక్మెయిల్ కు దిగాడు. దీంతో అప్పట్లో మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఆతర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వడం లేదని మొఘల్‌పురా వాసి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండకు చెందిన యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతే గాకుండా అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tollywood : ‘కొండా’తో కలిపి ఈ వారం తొమ్మిది!