Snapchat Trap: స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్.. కలవకపోతే న్యూడ్ ఫోటోస్ వైరల్ చేస్తానంటూ బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabadi Boy Trapped A Girl Via Snapchat And Harassed Her With Nude Pics: కొందరు కీచకులు అమ్మాయిల్ని ట్రాప్ చేసి, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు. హైదరాబాద్‌లో తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ట్రాప్ చేసి.. ఆమెతో తన కామవాంఛ తీర్చుకోవాలని ఓ దుర్మార్గుడు ప్రయత్నించాడు. అయితే.. ఆ యువతి చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల్ని ఆశ్రయించడంతో, బతికి బయటపడింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
Also Read
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
హైదరాబాద్‌కు చెందిన అలీ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం బీటెక్ చదువుతున్న ఓ అమ్మాయి స్నాప్‌చాట్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ యువతితో చనువు పెంచుకొని, తన ట్రాప్‌లో పడేశాడు. ఒకరోజు పర్సనల్ వీడియో కాల్ చేయమని అలీ చెప్పగా.. ఆ యువతి వీడియో కాల్ చేసింది. అప్పుడు అలీ ఆమెతో మాట్లాడుతూ.. స్క్రీన్ షాట్స్ తీశాడు. అనంతరం.. తనని కలవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. తనని కలవకపోతే, ఆ పర్సనల్ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. అతని దెబ్బకు భయభ్రాంతులకు గురైన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా వివరాలతో అలీని పట్టుకున్నారు. అనంతరం అతడ్ని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అతడ్ని విచారించగా.. ఇలాగే చాలామంది అమ్మాయిల్ని ట్రాప్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ
ఈ ఘటనపై కరాటే కళ్యాణి సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. హిందువుల అమ్మాయిలను కొందరు కావాలనే ట్రాప్ చేస్తున్నారని మండిపడింది. తాజాగా తాము హైదరాబాద్‌లో లవ్ జిహాద్ ఘటనని ఆపామని తెలిపారు. స్నాప్‌చాట్ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి, ఆమెని లోబరుచుకునేందుకు ప్రయత్నించాడన్నారు. ఇలాగే ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని, ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు బయటకి వస్తాయని అన్నారు. ఇదే సమయంలో బాధిత యువతి మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం అలీ తనకు ఆన్‌లైన్‌లో పరిచమయ్యాడని తెలిపింది. మంచిగా మాట్లాడుతూ అతడు దగ్గరయ్యాడని.. అతడు బలవంతం పెట్టడం వల్ల పర్సనల్ వీడియో కాల్ చేశానని చెప్పింది. కానీ.. అతడు ఫోటోలు క్యాప్చర్ చేసి, తనని కలవాలని ఒత్తిడి చేశాడని, లేకపోతే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఏం చేయాలో తెలీక.. తాను హిందూ సంఘ నాయకులకు సమాచారం ఇచ్చానని వివరించింది.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్‌డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్‌నెస్‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..