Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్‌గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్ కట్ చేస్తే భారీ సైబర్ మోసం బయటపడుతుంది. వృద్ధులు.. అమాయకులే సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ 80 ఏళ్ల వృద్ధున్ని నమ్మించి ఏకంగా 24 లక్షల రూపాయలు కొట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
READ ALSO: Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
పెట్టుబడుల పేరిట హైదరాబాద్ గోపన్‌పల్లిలో ఉంటున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అతన్ని మోసం చేసి లక్షల రూపాయలు కొట్టేసి చెక్కేశారు. తొలుత వృద్ధుడి ఫోన్‌కు రిధివెలే అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. అవతల అమ్మాయి అని తెలియగానే.. వృద్ధుడు కాస్తా బెండ్ అయ్యాడు. ఆ మాటా ఈ మాటా చెప్పి బుట్టలో పెట్టేసింది మాయలేడీ. క్రమక్రమంగా ముగ్గులోకి దించి.. కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అలాంటి యాప్స్ మన దగ్గర ఉన్నాయని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మాడు ఆ అమాయక వృద్ధుడు. గుడ్డిగా ఆమె చెప్పిన యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.
ప్రతి రోజూ మాటల్లో పెడుతూ.. పెట్టుబడులు పెట్టించింది మాయ లేడీ. కొంతకాలం భారీ లాభాలు వచ్చినట్లు బాధితుడికి తప్పుడు సమాచారం కూడా ఇచ్చింది. పైగా వృద్ధుడి అకౌంట్లో భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షల 77వేల 040 ఉన్నట్లు చూపించింది. ఇక అక్కడి నుంచి మరో కథ షురూ చేసింది. ఆ డబ్బు విడుదల చేయాలంటే ముందుగా ‘కన్వర్షన్ ఫీ’ చెల్లించాలని చెప్పింది. ఆ మాయలేడీ మాటలు ఇంకా నమ్మిన బాధితుడు.. వివిధ బ్యాంక్ ఖాతాలకు మొత్తంగా రూ.24 లక్షల 38 వేల 483 ట్రాన్స్‌ఫర్ చేశాడు. అప్పటికీ మాయలేడీ దాహం తీరలేదు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసం జరిగినట్లు గ్రహించాడు వృద్ధుడు. గట్టిగా నిలదీయడంతో అవతలిపక్క నుంచి ఫోన్ కట్ అయింది. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!