Hyderabad : మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు.. పలువురికి తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో వీధి కుక్కల బెడదా ఇంకా తగ్గలేదు.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు జనాల పై దాడి చేస్తూ బేంబేలెత్తిస్తున్నాయి.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.. ఇక తాజాగా హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్‌మెట్ పరిధి లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అంతేకాదు పలువురిని గాయ పరిచ్చినట్లు తెలుస్తుంది..
అదే విధంగా.. నేరేడ్‌మెట్ పరిధిలోనే.. వెస్ట్ శ్రీకృష్ణనగనర్‌లో ఒక చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేయబోయాయి. అయితే.. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.. ప్రస్తుతం జరిగిన ఘటనల వల్ల నగరం మరోసారి ఉలిక్కి పడింది.. ఈ ఘటనలకు సంబందించిన దృశ్యాలు సిసిటీవీ లో రికార్డ్ అయ్యాయి..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
ఒక్కసారిగా రెండు మూడు వీధికుక్కలు చిన్నారిపైకి ఎగబడబోయాయి. తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అయితే పాపకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆమె తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా.. వీధి కుక్కల బెడదతో హైదరాబాద్ ప్రజలు ఇంకా భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు.. వీధి కుక్కల బీభత్సంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. ఇప్పటికైనా.. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అప్రమత్తం కావాలని, వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. ఇక ప్రభుత్వం కూడా ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో ఈ విషయం పై చర్చించారు.. అధికారులు కుక్కలను పట్టుకోవాలి ఆదేశించారు.. మరోవైపు అధికారులు కూడా కుక్కలను పట్టుకుంటున్నారు.. ఇప్పటికే వేల సంఖ్యలో కుక్కలను పట్టుకున్నారు..
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?