Site icon NTV Telugu

Child Kidnap : బయటపడ్డ.. రిజ్వానా నర్సింగ్ హోమ్ రహస్యాలు..!

Dcp Vineet

Dcp Vineet

Child Kidnap: హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తులో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న పెద్ద గ్యాంగ్ బయటపడింది.

USA: మోడీ-పుతిన్ మీటింగ్‌.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..

ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. డీసీపీ వినీత్ వివరించిన ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా పిల్లల అమ్మకాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

ఆమెను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఇంకా ఎంత మంది చిన్నారులను అమ్మారన్న విషయంపై స్పష్టత రానుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాతో పాటు బాల్రాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడు తన ఇద్దరు పిల్లలను ఈ గ్యాంగ్‌కు అమ్మాడని విచారణలో తేలింది. అయితే కిడ్నాప్ చేసిన లాస్య, అమ్ములు అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మిగిలిన నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version