Hyderabad Drugs: అగ్గిపెట్టె.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి. కానీ ఇప్పుడు దాని అర్ధం మార్చేశారు డ్రగ్ పెడ్లర్లు. మట్టిగాజులు, డిక్షనరీలు, పుస్తకాలు.. కాదేదీ డ్రగ్ అక్రమ రవాణాకు అనర్హం అంటూ మత్తు దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపించేస్తున్నారు. కానీ అక్రమ దందా బాగోతం ఎన్నాళ్లు దాగుతుంది. పోలీసులు గట్టిగా నిఘా పెట్టడంతో మత్తు దందా కాస్త బయటపడింది.
డ్రగ్స్ కావాలా నాయనా. వాట్సాప్‌లో మెసేజ్.. లేదా టెలిగ్రామ్‌లో మెసేజ్.. జస్ట్ వాట్సాప్‌లో ఓ మెసేజ్.. లేదా టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ పెPACL Scam: 10 రాష్ట్రాల్లో బ్రాంచులు.. రూ.49 వేల కోట్ల కుంభకోణం… కంపెనీ డైరెక్టర్ అరెస్ట్..ట్టండి చాలు.. మీ ఇంటికే కొరియర్ వస్తుందంటున్నారు డ్రగ్ పెడ్లర్లు. చాలా కాలం నుంచి పోలీసులకు చిక్కకుండా ఇదే రీతిలో దందా చేస్తున్నారు. ఇటీవల మహేంద్ర యూనివర్సిటీ, మల్నాడ్ డ్రగ్ కేసుల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో సె*క్స్ చేయొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే!
ఈగల్ టీమ్ కళ్లపడకుండా డ్రగ్స్ ఎలా వస్తున్నాయని.. ఆరా తీసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. మట్టి గాజులు, డిక్షనరీలు, పుస్తకాలు, సౌందర్య ఔషధాలు, మెడికల్ డ్రగ్స్, ఇంపోర్టెడ్ టాల్కం పౌడర్, ఇంపోర్టెడ్ లిప్ స్టిక్, విదేశాల నుంచి షూస్, చెప్పులు, శాండిల్స్, రెడీమేడ్ దుస్తులు ఇలా ఒకటేమిటి పలు రకాల వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30 రకాల వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి కన్స్యూమర్లకు చేర్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఏకంగా కొరియర్ సంస్థ.. కేవలం ఈ డ్రగ్ సర్వీసెస్ ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు గుర్తించారు పోలీసులు.
హైదరాబాద్ లోని వివిధ యూనివర్శిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లోని స్టూడెంట్స్‌కు డ్రగ్స్ ఇదే రూపంలో అందుతున్నాయి. ముఖ్యంగా పుస్తకాలు, డిక్షనరీలు, సౌందర్య సాధనాలు, మట్టిగాజుల రూపంలో డ్రగ్స్ సప్లై జరుగుతోంది. వివిధ కొరియర్ల ద్వారా నేరుగా క్యాంపస్‌లలోకి, హాస్టళ్లలోకి మత్తు పదార్థాలు వెళ్లిపోతున్నాయి. అటు మల్నాడ్ రెస్టారెంట్ కేసులోనూ బెంగళూరు, గోవా నుంచి షూస్, కాస్మోటిక్స్ రూపంలో డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు తేల్చారు. ఇటీవల మహేంద్ర యూనివర్శిటీలోని కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఓ డిక్షనరీ తెరిచి చూస్తే అందులో హెరాయిన్ ప్యాకెట్లు లభించాయి. ఇదే రకంగా నిత్యం ఏదో ఒక విద్యార్థికి పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.
US Police Firing: అమెరికాలో ఓ సిక్కును కాల్చి చంపిన పోలీసులు.. ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ లేడీ ఇంటికి వందల కొద్దీ మట్టిగాజులు పార్శిల్ రూపంలో వస్తున్నాయి. వీటిని పరిశీలించడంతో సూడో ఎఫిడ్రిన్ పొట్లాలు బయటపడ్డాయి. ఒక వైన్ షాప్ నడిపే యజమాని ఇంటికి వారంలో ఒకరోజు సప్లిమెంట్ డ్రింక్స్ డబ్బాల కొద్దీ వస్తున్నాయి. అతని ఇంటిపై నిఘా పెట్టి పట్టుకుంటే.. తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరులు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.
దేశ, విదేశాల నుంచి మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులను చేరవేసేందుకు పలు కొరియర్ సంస్థలు సహకరిస్తున్నాయని పలుమార్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేశారు. కొరియర్ పార్శిల్స్ చేరవేసే సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలి. అనుమానాస్పద వస్తువులున్నట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులకు పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారు. ఒకే రకమైన వస్తువులు పదేపదే ఒకరి ఇంటికి వస్తుంటే దానికి సంబంధించిన సమాచారం చేరవేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇలాంటి వస్తువులు పదేపదే వస్తే వాటి సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో సదరు కొరియర్ సర్వీస్ పైన కూడా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.