Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fine Rice Prices Surge in Godavari Districts: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత రెండున్నర నెలల్లో క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో.. సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం, బియ్యం ఎగుమతులు పెరగడం, మార్కెట్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని రైస్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. 52 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నామని, కానీ కేవలం నెల రోజుల వ్యవధిలో క్వింటాల్‌కు రూ.1,000 వరకు ధరలు పెరగడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
రైతుల వద్ద సరిపడా ధాన్యం లేకపోవడం, కొందరు మిల్లర్లు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో నిల్వలు ఉంచుకోవడం వల్ల మార్కెట్లో సరఫరా తగ్గిందని మిల్లర్ల సంఘం పేర్కొంటోంది. అందుకే సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించినప్పటికీ.. పంట దిగుబడులు తగ్గిన పరిస్థితిలో దీర్ఘకాలికంగా సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సరిపడా పంట లేకపోతే మార్కెట్లో ధరలను నియంత్రించడం సవాలుగా మారుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అటు వినియోగదారులు బియ్యం ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల బియ్యం ధరలు బస్తాకు రూ.200 నుంచి రూ.400 వరకు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. బియ్యం ఎగుమతులు పెరగడం, కరువు వస్తుందన్న అంచనాల పేరుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల మరో పెద్ద భారంగా మారింది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!