Site icon NTV Telugu

Chennai Tragedy: చెన్నైలో విషాదం.. కన్న తండ్రే కాలయముడై!

Crime Scene

Crime Scene

కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతనే యముడయ్యాడు. భర్త అంటే భరించేవాడు. కానీ ఆ భర్త ఆ ఇల్లాలి పాలిట కర్కోటకుడు అయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై లో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. అప్పుల భారం తట్టుకోలేక భార్య,ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపేశాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రకాష్.

ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్‌లో కొనుగోలు చేశాడు ప్రకాష్. ముగ్గురిని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త ప్రకాష్. చెన్నై పల్లావరంలో జరిగిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. పైగా ముగ్గురిని హతమార్చడానికి తమ పెళ్ళిరోజును ముహూర్తంగా పెట్టుకున్నాడు ప్రకాష్. కుటుంబం మొత్తాన్ని చంపేసి, తను ఆత్మహత్య చేసుకున్న ప్రకాష్ ఉదంతం కలకలం రేపింది. మాకు మేముగా ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ లెటర్ ను గోడకు అంటించి మరీ ప్రకాష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అప్పులు ఎంతటి విషాదానికి కారణమయ్యాయో చూశారా.

వివాహిత అనుమానాస్పద మృతి

తెలంగాణలోొ ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. నిర్మల్ జిల్లా కేంద్రం లోని అస్రా కాలనీలో నివాసముండే భోద్ కు చెందిన గొల్లమాడ స్రవంతి అనే 28 సంవత్సరాల వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ

Exit mobile version