NTV Telugu Site icon

Teachers Affair: టీచర్ల వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో అడ్డంగా బుక్

Teachers Affair

Teachers Affair

Husband Redhandedly Caught His Wife With Another Man In Mulugu: వాళ్లిద్దరు టీచర్స్.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉన్నత హోదాలో ఉన్నారు. అలాంటి ఆ ఇద్దరు దారి తప్పారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కామక్రీడల్ని కొనసాగించారు. తాము చేస్తోంది తప్పని తెలిసినప్పటికీ.. తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం హద్దుమీరారు. కానీ, ఒక ఫోన్ కాల్ వీరిని అడ్డంగా పట్టించింది. ‘నేను వస్తున్నాను, తలుపు తీసి ఉంచు’ అంటూ ఫోన్‌లో చెప్పిన మాట.. వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Kiran Abbavaram: రేయ్ ఎవర్రా మీరంతా? నా సినిమాని ఎందుకు చూస్తారు?

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో కుక్కల నాగేందర్, ఓ మహిళ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకే స్కూల్‌లో పని చేస్తుండటం.. వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏఆర్ కానిస్టేబుల్ అయిన ఉపాధ్యాయురాలి భర్తకు వారి తతంగం గురించి తెలిసి, గతంలోనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను మరో పాఠశాలకు పంపారు. అయినా సరే.. ఆమె తీరు మార్చుకోలేదు. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే.. ఈసారి రహస్యంగా తమ రిలేషన్ కొనసాగించారు. తన భర్తకు అనుమానం రాకుండా, ఆ ఉపాధ్యాయురాలు సీక్రెట్‌గా ఎఫైర్ నడిపింది.

Bird Flu: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్.. కడక్‌నాథ్ కోళ్లలో గుర్తింపు..

కట్ చేస్తే.. ఫిబ్రవరి 18న శివరాత్రి బందోబస్తుకు వెళ్లిన ఉపాధ్యాయురాలి భర్త, సోమవారం సెలవు కావడంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో మహిళా టీచర్‌కు నాగేందర్ ఫోన్ చేశాడు. అయితే.. ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆయన హలో అని చెప్పడానికి ముందే.. ‘నేను వస్తున్నాను, తలుపు తీసి ఉంచు’ అని నాగేందర్ చెప్పాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్.. వాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేశాడు. ఫోన్ విషయం భార్యకు చెప్పకుండా.. చివరి గదిని లాక్ చేసి, ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్‌లో దాక్కున్నాడు. నాగేందర్ ఇంట్లోకి వెళ్లగానే.. ఆ కానిస్టేబుల్ బయటి నుంచి తాళం వేశాడు.

Kantara 2: ‘కాంతార’లో సూపర్ స్టార్?

అనంతరం తన బంధువులకు, ఉపాధ్యాయులకు కానిస్టేబుల్ సమాచారం అందించాడు. తన భార్య, నాగేందర్ బాగోతం గురించి అందరికీ లైవ్‌లో చూపించాడు. ఆ తర్వాత నాగేందర్, మహిళా టీచర్‌ను దేహశుద్ధి చేశాడు. ఇద్దరిని తాడుతో కట్టేసి కొట్టాడు. అందరూ చూస్తుండగా రోడ్డుపై నడిపిస్తూ, కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌ వరకు తీసుకెళ్లి అప్పగించాడు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.