ఉత్తరప్రదేశ్ లో ఇటీవల సంచలనంగా మారిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హోటల్ రూమ్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. తల, మొండెం వేరుచేసి నగ్నంగా మహిళ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ ఘటన గతనెలలో స్థానికంగా సంచలనం రేపింది. అంత దారుణంగా ఆమెను ఎవరు చంపారు.. అని పోలీసులు విచారించగా చివరికి ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు గుర్తించి అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని పన్వేల్‌కు చెందిన పూనమ్‌కు, రాంపాల్‌కు ఏడాది క్రితం వివాహమైంది. పూనమ్ స్థానిక హాస్పిటల్లో నర్స్ గా పని చేస్తోంది. పెళ్లైన కొద్దీ రోజులు బాగానే ఉన్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భార్య వేరొకరితో మాట్లాడుతుందేమో అని రాంపాల్ అనుమానం పెంచుకున్నాడు.. ఆ అనుమానం పెరిగి భార్యపై కక్షలా మారింది. గత ఆదివారం భార్యను తీసుకుని రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జికి తీసుకెళ్లి ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే లాడ్జికి తీసుకెళ్లి ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను దొరకకూడదని తలను, టాటూ ఉన్న చేతిని నరికి.. బట్టలు తీసేసి నగ్నంగా మార్చి పరారయ్యాడు.
ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. అయినా ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇటీవల హోటల్ కి 50 కి. మీ దూరంలో ఒక లేడీ హ్యాండ్ బ్యాగ్ ని గుర్తించిన పోలీసులు అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు పూనమ్ అని గుర్తించారు. ఆ తరువాత భర్త రాంపాల్ ని వెతికి పట్టుకొని విచారించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు. దీంతో అతనిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.