NTV Telugu Site icon

Crime: షాపింగ్ కి విపరీతంగా డబ్బు ఖర్చు చేసిన భార్య.. సుపారీ ఇచ్చి చంపించిన భర్త

Crime

Crime

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను చంపించాడు. ఈ హత్యలో యువకుడి స్నేహితుడు కూడా అతనికి సహకరించాడు. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం. షాపింగ్ కు విపరీతంగా డబ్బులు ఖర్చుచేస్తుందనే కారణంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

READ MORE: Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 13న విక్కీ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లోడింగ్ వాహనం ఢీకొనడంతో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న దుర్గావతి అనే మహిళ మృతి చెందగా, మోటారు సైకిల్ నడుపుతున్న దుర్గావతి సోదరుడు సందేశ్‌కు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని దుర్గావతి భర్త అజయ్ భార్గవ పోలీసులకు తెలిపాడు. గుడికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు అజయ్ పేర్కొన్నాడు. అప్పట్లో పోలీసులు కూడా ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 11 రోజుల తర్వాత ఇప్పుడు పోలీసులకు అసలు విషయం తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఫుటేజీలో లోడింగ్ వాహనం కనిపించలేదు. అయితే.. సందేశ్, దుర్గావతి ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ వెనుక ఎకో స్పోర్ట్ కారు కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

READ MORE:Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్

దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బైక్ ను ఢీకొట్టింది లోడింగ్ వెహికల్ లా కాదా అని అజయ్ కి పోలీసులు అడిగారు. దీనిపై అజయ్ మాట్లాడుతూ.. అది కారు కూడా కావచ్చని అనుమానాస్పదంగా సమాధానం చెప్పాడు. ఇక్కడి నుంచి అజయ్‌పై పోలీసులకు అనుమానం బలపడింది. దీంతో పోలీసులు అజయ్ జాతకాన్ని పరిశీలించడం ప్రారంభించారు. దుర్గావతిని అజయ్ రెండో భార్య అని పోలీసుల విచారణలో తేలింది. దుర్గావతితో కూడా అజయ్ ప్రేమ వ్యవహారం నడిపాడు. 2017 సంవత్సరంలో ఇరువురు పరిచయమ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే 2021లో దుర్గావతి వేరే పెళ్లి చేసుకుంది.

READ MORE: Harish Shankar: మీతో మరో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. విశ్వప్రసాద్ కి హరీష్ శంకర్ ట్వీట్

అజయ్ కూడా 2022లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ తమ తమ జీవితాల్లో బిజీగా మారారు. కానీ అజయ్ వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, దుర్గావతి తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చింది. మరోసారి దుర్గావతి, అజయ్ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇరువురు 2023లో వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ఇద్దరూ పడవ్ ప్రాంతంలోని సాకేత్ నగర్‌లో నివసించడం ప్రారంభించారు. తన రెండవ భార్య దుర్గావతి అతి ఖర్చు చేస్తుండటం అజయ్ కి నచ్చలేదు. దీని వల్ల అతడి ఆర్థిక పరిస్థితి దిగజారింది. కోపంతో తనను చంపేందుకు కుట్ర పన్నాడు. అతడి మిత్రునికి రూ.2.5 లక్షలు ఇచ్చి భార్యను హత్య చేయించాడు.

Show comments