Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది.
ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్‌కు పాల్పడ్డారని , ఆమెను బెదిరించారని ఆరోపించారు. కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను కూడా ఫిర్యాదులో నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన మరియు మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని తండ్రి ఆరోపించారు.
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
Read Also: Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
డిసెంబర్ 26న లూథియానాలోని ఆస్పత్రిలో మరణించడానికి ముందు, బాధితురాలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిందని ఆమె కుటుంబం తెలిపింది. తన కుమార్తె మరణంతో షాక్‌లో ఉన్న తాను ముందుగా ఫిర్యాదు చేయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. తమ కుమార్తె చనిపోయే ముందు మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. ప్రొఫెసర్ అనుచితంగా తాకడం, క్యాంపస్‌లో మానసిక వేధింపుల గురించి మృతురాలు బాధను వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 20న పోలీసులు, ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని తండ్రి వెల్లడించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని చికిత్స పొందిన అన్ని ఆస్పత్రుల్లో విచారణ జరుగుతోంది. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై వేరే కథనాన్ని చెబుతోంది. సదరు మహిళ మొదటి ఏడాది ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ అడ్మిషన్ కోరిందని పేర్కొంది. ఆమె తమకు ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా ఆరోపించారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?