Shocking M*urders: “అందంగా ఉంటే అసూయ”.. కోడలు, కొడుకుతో సహా నలుగుర్ని చంపేసిన క్రూరురాలు..
- తన కన్నా అందంగా ఉంటే అసూయ..
- కోడలు, కొడుకుతో సహా నలుగురి హత్య..
- చిన్నారులనే టార్గెట్ చేసిన క్రూరురాలు..
- మేనకోడలి హత్యతో బయటపడిన హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking M*urders: తన కన్నా ‘‘అందం’’గా ఉంటే జీర్ణించుకోలేని మనస్తత్వం ఒక మహిళను క్రూరురాలిగా మార్చింది. చిన్న పిల్లలు అని చూడకుండా పసిపిల్లల్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన 6 ఏళ్ల చిన్నారి మరణాన్ని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 6 ఏళ్ల మేనకోడలిని హత్య చేసినందుకు ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరూ కూడా తన కన్నా అందంగా కనిపించకూడదనే భావనతోనే ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.
సోమవారం సోనిపట్‌లో కుటుంబ సభ్యులందరూ వివాహ వేడుకకు హాజరైనప్పుడు, నిందితురాలు పూనమ్ తన మేనకోడలని నీటి తొట్టిలో ముంచి చంపేసింది. పూనమ్ గతంలో 2023లో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లల్ని చంపింది. ఆమె తన మేనకోడలిలాగే వారిని కూడా నీటిలో ముంచి చంపింది.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
హత్య ఎలా జరిగింది?
చిన్నారి విధి సోనిపట్‌లో నివసిస్తోంది. తన కుటుంబంతో బంధువుల వివాహానికి హాజరుకావడానికి పానిపట్ లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వివాహ ఊరేగింపు నౌల్తా గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ హత్య జరిగింది. కుటుంబం ఊరేగింపుతో వెళ్లి పోయింది.
దీని తర్వాత విధి కనిపించడం లేదంటూ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబం మొత్తం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, ఆమె అమ్మమ్మ ఓంవతి, వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్ రూంలోకి వెళ్లింది. స్టోర్ రూం తలుపులు బయట నుంచి బోల్ట్ పెట్టి ఉంది. ఓంవంతి డోర్ తెరిచిన తర్వాత షాకింగ్ దృశ్యాన్ని చూసింది. విధి తల నీటి టబ్‌లో ముగిగిపోయి, కాళ్లు నేలపై ఉన్న స్థితిలో కనిపించింది. బాలికను స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల విచారణలో విధి అత్త పూనమ్ ఆమెను చంపినట్లు తేలింది.
అందంగా ఉంటే హత్య:
పూనమ్ తన కెంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకునేదని, ఎవరైనా తన కన్నా అందంగా ఉంటే అసూయ, ఆగ్రహంతో రగిలిపోయేదని, పిల్లల్ని నీటిలో ముంచి చంపేదని తేలింది. ముగ్గురు బాలికను, సొంత కొడుకును కూడా ఇలాగే చంపినట్లే అంగీకరించింది. 2023లో పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే ఏడాది అనుమానం రాకుండా ఉండటానికి తన కొడుకును కూడా నీట ముంచి చంపింది. ఈ ఏడాది ఆగస్టులో పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది.
ప్రతీ మరణమూ కూడా ఒకే విధంగా జరిగాయి. పిల్లలు లోతు లేని నీటిలో ముగినిపోయారు. ఒక కేసులో టబ్ ఒక అడుగు లోతు మాత్రమే ఉండటంతో, ఆ చిన్నారి ఎత్తు బట్టి ప్రమాదవశాత్తు మరణించే అవకాశం ఉందా అనే దానిపై దర్యాప్తు అధికారులు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా చేసిన హత్యను పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. విచారణలో ప్రశ్నించగా నలుగుర్ని తానే చంపినట్లు ఆమె ఒప్పుకుంది. ముగ్గురు ఆమె బంధువులైన అమ్మాయిలు, ఆమె కొడుకు కూడా మృతుల జాబితాలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!