NTV Telugu Site icon

Vizag Crime: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి.. అదనపు కట్నం కోసం వేధింపులు..! వివాహిత ఆత్మహత్య..

Crime

Crime

Vizag Crime: విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.. తమ కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కోట్లలో కట్నం తీసుకున్నా.. అదనపు కట్నం కోసం వేధింపులు ఏంటి అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.. అయితే, సత్య ప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు..

Read Also: Samagra Kutumba Survey: అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..

ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్య ప్రియకి చార్టర్డ్ అకౌంటెంట్‌ కార్తికేయకి వివాహం జరిపించారు ఇరు కుటుంబాలు.. అయితే, కొంతకాలం వారి కాపురం సవ్యంగా సాగినా.. ఆ తర్వాత అదనపుకట్నం కావాలంటూ వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో.. తమ కూతురుని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.. ఇక, మృతురాలి భర్త, మమాలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మృతురాలి భర్త, తండ్రి.. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది..

Show comments