AHMEDABAD: ఇంటి నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మన జాగ్రత్తల్లో మనం ఉన్నా కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో ఊహించడం కష్టం అవుతుంది.. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంధి ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం వల్ల పది మంది ప్రాణాలను కోల్పోయారు.. ఈ ప్రమాదంతో జనాలు ఉలిక్కి పడ్డారు.. వివరాల్లోకి వెళితే..
శుక్రవారం గుజరాత్‌లో ని అహ్మదాబాద్ జిల్లాలో నిశ్చలంగా ఉన్న ట్రక్కు ను మినీ ట్రక్కు ఢీకొనడం తో ముగ్గురు చిన్నారులు సహా కనీసం 10 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పొరుగున ఉన్న సురేంద్ర నగర్ జిల్లాలోని చోటిలా నుండి కొంతమంది వ్యక్తులు అహ్మదాబాద్‌కు తిరిగి వస్తుండగా రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేలోని బగోదర గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.
ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు మృతి చెందారని అహ్మదాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వాసవా తెలిపారు. ఈ ఘటన కొంతమంది తీవ్రంగా గాయపడటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఇక గతంలో అదే ప్రాంతం లో ఎన్నో ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు.. అతి వేగంగా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు..